
TELANGANA PATRIKA (MAY19) , గిరిజన రైతులకు నీటి వెలుగు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభం
తెలంగాణ గిరిజన రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
గిరిజన రైతులకు నీటి భద్రత కోసం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం
ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం, విద్యుత్ సౌకర్యం లేని పోడు భూములకు సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించడం. ఈ ఆధునిక సాంకేతికత ఆధారిత పద్ధతి ద్వారా ఆరు లక్షల ఎకరాల భూమికి నీటి సౌకర్యం అందించనున్నారు. ఇది రాష్ట్రంలోని గిరిజన రైతులకు ఒక పెద్ద ఊరటగా మారనుంది.
ఈ పథకం లబ్ధిదారులు RoFR (Forest Rights Act – 2006) ప్రకారం అటవీ భూములపై హక్కులు కలిగి ఉన్న గిరిజన రైతులు మాత్రమే. ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా దరఖాస్తు చేసిన వారికి సోలార్ పంపుల అమరిక జరుగుతుంది.
ఇందిరా గిరి జల వికాసం పథకం, గిరిజనుల జీవనోపాధి మెరుగుదల, వ్యవసాయం అభివృద్ధి దిశగా కీలక మెట్టు కానుంది. ఈ పథకం అమలు వల్ల వర్షాధారంగా ఉన్న భూముల్లో సుమారు ఏడు నెలలపాటు సాగు సాగుతుంది.
Also Read : సిరిసిల్ల క్రికెట్ మైదానంలో MLA, కలెక్టర్ సందడి..!
Comments are closed.