Telanganapatrika (July 10): Indira Mahila shakti Celebrations, ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ శ్రావణి వివో లక్ష్మీ దుర్గ వివో జ్యోతి వివో డ్వాక్రా గ్రూపు మహిళలల ఆధ్వర్యంలో ఇందిరా మహిళ శక్తి సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు మహిళలకు ప్రమాద బీమా 10 లక్షలు ఇన్సూరెన్స్ 15 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన వారికి కిశోర బాలికలకు సంఘాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మహిళ సంఘాలుగా ఏర్పాటు చేయాలని వికలాంగులను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుంటే (ఎస్.బి.వై) జేజే వై ఇన్సూరెన్స్ వర్తిస్తాయని తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్షమని తెలిపారు (పి.ఎం.కె.ఎస్.వై) శ్రీనిధి బ్యాంకు లింకేజీ పై తీసుకున్నవారు డ్వాక్రా గ్రూపు ప్రతి ఒక్క మహిళ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా కట్టుకోవాలని తెలియజేశారు ప్రభుత్వ పథకాలపై కళాకారులతో ఘనంగా ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో. క్లస్టర్ కోఆర్డినేటర్ పెద్దలయ,వివో ఏలు దొడ్డి రాము, రామ నరసయ్య వివో అధ్యక్షులు కొమరం సత్యవతి, మహిళా మండల కార్యదర్శి వేమూరి మాధవి, కక్కర్ల సునీత,గౌరమ్మ, కృష్ణవేణి,సుశీల,రాణి,సావిత్రి మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!