Advertisement

Illegal Ration Rice Seized Khammam : వైరాలో 145 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత..!

TELANGANAPATRIKA (June 19):Illegal Ration Rice Seized Khammam . ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఒక లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 145 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడ్ చేసిన ఈ లారీని ఎస్సై రామారావు నేతృత్వంలోని పోలీసు బృందం పట్టుకుంది. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ నంబరు గల AP 29 TA 7032 లారీ ద్వారా కల్లూరు నుంచి హైదరాబాద్‌కు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అన్న సమాచారం అందిన వెంటనే, ఉదయం 9:30 ప్రాంతంలో వైరా పోలీస్ స్టేషన్ ఎదుటే లారీని అడ్డుకున్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Illegal Ration Rice Seized Khammam డ్రైవర్ అదుపులో, లారీ సీజ్

లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 145 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం లారీలో ఉన్నట్టు నిర్ధారించడంతో, లారీని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని విచారణలు కొనసాగుతున్నాయని సమాచారం.

Advertisement

అధికారులు అప్రమత్తం

ఈ రేషన్ బియ్యం ఎక్కడి డీలర్లకు చెందిందన్న అంశాన్ని సైతం పోలీసులు పరిశోధిస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →