Telanganapatrika (August 21): రూ.400 కోట్ల ప్రభుత్వ భూములు సేఫ్ హైడ్రా టీమ్ , హైదరాబాద్‌లో భూముల ఆక్రమణలపై హైడ్రా విభాగం కఠిన చర్యలు తీసుకుంది. మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్ పరిసరాల్లోని పార్కులు, రహదారులపై జరిగిన అక్రమ నిర్మాణాలను తొలగించింది.

రూ.400 కోట్ల ప్రభుత్వ భూములు సేఫ్ హైడ్రా టీమ్
ఎన్క్లేవ్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు, GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్క్‌లను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తేలింది. ఈ దర్యాప్తు అనంతరం, మొత్తం 16,000 గజాల భూమిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ భూముల అంచనా విలువ సుమారు రూ.400 కోట్లు అని అధికారులు వెల్లడించారు. ఈ చర్యతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా విభాగం కఠిన చర్యలు
భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఇకపై రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలోని ప్రతి జోన్‌లో ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించే పనిలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
Read More: Read Today’s E-paper News in Telugu