Hyderabad Traffic Restrictions: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో డిసెంబర్ 17 నుంచి 22 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. వీవీఐపీ కదలికల నేపథ్యంలో కొన్ని కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా దారి మళ్లించడం జరుగుతుంది.

డిసెంబర్ 17 (మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు)
హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్, బొల్లారం చెక్‌పోస్ట్, కౌకూర్ రోడ్, రిసాలా బజార్, లక్కడావాల, డౌన్‌టౌన్, ఆల్వాల్ టీ జంక్షన్, లోతుకుంట, లాల్ బజార్, ట్రిముల్గెర్రీ క్రాస్ రోడ్, కార్ఖానా, ఎయిర్‌టెల్, ఎన్‌సీసీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రభావం ఉంటుంది.
డిసెంబర్ 19
బైసన్ సిగ్నల్, ఆర్‌ఎస్‌ఐ సర్కిల్, నేవీ హౌస్ నుంచి ట్రిముల్గెర్రీ, వైఎంసీఏ, టివోలి, ప్లాజా, అలుగడ్డబావి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
డిసెంబర్ 20 (మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 వరకు)
బేగంపేట, పంజాగుట్ట, గ్రీన్‌లాండ్స్, ఎన్‌ఎఫ్‌సీఎల్ ఫ్లైఓవర్, కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.45, 65 వంటి ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
డిసెంబర్ 21 (సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు)
బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీఓ, కార్ఖానా, ట్రిముల్గెర్రీ, ఆల్వాల్ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డిసెంబర్ 22 (సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు)
హకీంపేట నుంచి ఆల్వాల్, లోతుకుంట, లాల్ బజార్, కార్ఖానా వరకు ట్రాఫిక్ ప్రభావం ఉంటుందని పోలీసులు తెలిపారు.
Hyderabad Traffic Restrictions ప్రజలకు సూచన
ఈ తేదీల్లో ప్రయాణించే వారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ సమాచారానికి హెల్ప్‌లైన్ నంబర్: 9010203626 అందుబాటులో ఉంటుంది. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు నగరవాసులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
