Hyderabad ORR toll payments: హైదరాబాద్ నగరంలోని ORR (ఔటర్ రింగ్ రోడ్) టోల్ ప్లాజాల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై క్యాష్ ద్వారా టోల్ చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తూ, డిజిటల్ పేమెంట్స్‌ను తప్పనిసరి చేశారు.

దేశవ్యాప్తంగా National Highways Authority of India (NHAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని టోల్ ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్‌పై పూర్తిగా నిషేధం విధించబడింది.
Hyderabad ORR toll payments ఈ మార్పుల ప్రకారం, హైదరాబాద్ ORRలోని 19 టోల్ ప్లాజాల్లో ఇప్పుడు QR కోడ్ ద్వారా పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు FASTag లేదా UPI ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త విధానం వల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గి, ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో పెద్ద క్యూలు తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
Hyderabad ORR toll payments టోల్‌లో ఇక ఫాస్ట్ & స్మార్ట్ పేమెంట్స్
అదేవిధంగా, వేగంగా టోల్ ప్రాసెసింగ్ జరగడం వల్ల ఇంధన వినియోగం తగ్గి, కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు లేని వారికి మొదట్లో కొంత ఇబ్బంది కలగొచ్చు. FASTag లేని లేదా బ్యాలెన్స్ లేని వాహనాలు జరిమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో QR కోడ్ స్కాన్ చేసి UPI ద్వారా వెంటనే పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నెట్‌వర్క్ సమస్యల వల్ల కొన్నిసార్లు ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రయాణికులు ముందుగానే తమ FASTag యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని, అలాగే సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అదనంగా, మొబైల్‌లో UPI యాప్‌ను బ్యాకప్‌గా ఉంచుకోవడం మంచిదని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
