Hyderabad Cyber Crime: తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద నష్టం కలిగిస్తున్న పైరసీ వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. iBomma, Bappam లాంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు మొత్తం 65 వెబ్‌సైట్లుపై కేసులు నమోదు చేశారు.

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలు గంటల వ్యవధిలోనే ఈ వెబ్‌సైట్లలో లీక్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన “Thandel” కూడా ఇదే విధంగా లీక్ కావడంతో సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పైరసీ వెబ్‌సైట్లు ఎలా పనిచేస్తున్నాయి?
ఈ వెబ్‌సైట్లు తరచూ కొత్త డొమైన్‌లు తీసుకుని పేర్లు మార్చుకుంటూ పట్టుబడకుండా తప్పించుకుంటున్నాయి.
సర్వర్‌లను దాచిపెట్టేందుకు Cloudflare వంటి హోస్టింగ్ సర్వీసులను వాడుతున్నాయి.
అంచనా ప్రకారం, దాదాపు 95% పైరసీ సైట్లు Cloudflare ద్వారా నడుస్తున్నాయి.
Hyderabad Cyber Crime కేసు నమోదు & తదుపరి చర్యలు
సైబర్ క్రైమ్ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల పైరసీని ఆపేందుకు కఠిన చర్యలు తప్పనిసరిగా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
