
Telanganapatrika (August 28): Hyderabad Beach, హైదరాబాద్ ప్రజలకు ఒక మంచి వార్త. త్వరలోనే నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ రానుంది. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలపగా, సుమారు 35 ఎకరాల్లో రూ.225 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలుకానుంది. ఈ ఏడాది డిసెంబర్ నుండి పనులు ప్రారంభం కానున్నాయి.
Hyderabad beach Kothwalguda 225 crore project
బీచ్‌లో ప్రత్యేక ఆకర్షణలు
ప్రాజెక్ట్‌లో భాగంగా ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లోనే ఒక చిన్న గోవా లేదా కొచ్చి బీచ్ అనుభూతి కలిగేలా ఉండబోతోంది.
టూరిజం హబ్‌గా మారనున్న కొత్వాల్‌గూడ.
ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటంతో, ఈ బీచ్ టూరిస్టులకు, హైదరాబాద్ ప్రజలకు కొత్త వినోద కేంద్రంగా మారనుంది. కుటుంబాల కోసం రిసార్ట్ స్టే, ఈవెంట్ జోన్లు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చేర్చనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆర్థిక, ఉపాధి ప్రయోజనాలు
ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత టూరిజం ఆదాయం పెరగడమే కాకుండా, వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ బీచ్ తెలంగాణలో కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.