Advertisement

Honeymoon Murder Case: రాజాకు మూడు సార్లు తలపై కొట్టారు – పోలీసుల నిజాలు బహిర్గతం

Telanganapatrika (June 18): Honeymoon murder కేసులో తాజా సమాచారం ప్రకారం, మే 23న మెఘాలయలో తన హనీమూన్ ట్రిప్‌లో భర్తను హత్య చేసిన కేసులో రాజా రఘువంశీ తలపై మూడు సార్లు కత్తులతో దాడి చేయడం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మర్డర్ ప్లాన్ మొత్తాన్ని పోలీసులు మళ్లీ ఆ స్థలంలో ప్లేబ్యాక్ చేయించారు. ఈ చర్యతో అసలు ఎక్కడ ఎవరు నిలిచారు, ఎలా దాడి చేశారు అన్నది పూర్తిగా స్పష్టమైంది. Honeymoon murder కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్, మరో నలుగురు హత్యకు సహకరించిన వ్యక్తులు ఈ క్రైం సీన్ రీక్రియేషన్‌లో పాల్గొన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Honeymoon Murder Case 2025 june update
Honeymoon Murder Case 2025 june update

పోలీసుల ప్రకటన ప్రకారం, మొదటి దెబ్బ విషాల్ అనే వ్యక్తి కొట్టగా, రెండో దెబ్బ ఆనంద్, చివరి దెబ్బ ఆకాశ్ వేశాడు. హత్య అనంతరం రాజా శరీరాన్ని గజిబిజిగా పడేసినట్టు వారు చెప్పారు. మర్డర్ తరువాత రాజా మొబైల్‌ను సోనమ్ ధ్వంసం చేయించి, విషాల్‌కు ఇచ్చినట్టు కూడా తేలింది. ప్రస్తుతం రెండో కత్తి కోసం SDRF బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసిన హ*త్యగా పోలీసులు నిర్ధారించారు. రాజ్ కుశ్వాహా అనే సోనమ్ ప్రియుడు ఈ హత్యకు మాస్టర్ మైండ్ అన్న విషయం బయటపడింది.

Advertisement

ఈ ఘోరమైన Honeymoon murder కేసులో ఐదుగురు నిందితులను మెఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఘజీపూర్ నుంచి సోనమ్‌ను తీసుకొచ్చారు. మరోవైపు రాజా మృతదేహాన్ని జూన్ 2న గార్జ్‌లో కనుగొన్నారు. DNA ద్వారా మృతదేహం గుర్తింపు పూర్తయిన తరువాత కుటుంబానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →