Telanganapatrika (August 12): Home Loan, హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల EMI చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. కానీ సరైన ప్రణాళిక, స్మార్ట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్‌తో EMIను తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే వడ్డీ భారం తగ్గి, రుణాన్ని త్వరగా పూర్తిచేయవచ్చు.

Home Loan EMI తగ్గించే 5 స్మార్ట్ ఐడియాస్..
1. Home Loan ముందస్తు చెల్లింపు (Prepayment)
- రుణంలో కొంత భాగాన్ని గడువుకు ముందే చెల్లించడం.
- ప్రారంభ సంవత్సరాల్లో EMIలో ఎక్కువ భాగం వడ్డీకి వెళుతుంది, అసలు మొత్తం తగ్గడం నెమ్మదిగా జరుగుతుంది.
- ఉదాహరణ: ₹50 లక్షల రుణం, 10 సంవత్సరాలు, 8% వడ్డీ → EMI ₹60,664.
- రెండు సార్లు ₹4 లక్షల చొప్పున ముందస్తు చెల్లిస్తే → EMI ₹50,544కి తగ్గుతుంది.
- వడ్డీ ఆదా: ₹3.46 లక్షలు
2. బ్యాంకుతో వడ్డీ రేటు చర్చలు
- మంచి క్రెడిట్ స్కోర్, టైమ్‌కు EMI చెల్లింపు ఉంటే బ్యాంకుతో వడ్డీ తగ్గించుకోవడం సాధ్యం.
- ఇతర బ్యాంకులు తక్కువ రేటు ఇస్తే ఆ ఆఫర్ చూపించి బేరసారాలు చేయండి.
- మంచి కస్టమర్‌ను బ్యాంకులు వదులుకోవాలనుకోవు.
3. స్టెప్-అప్ EMI పద్ధతి
- జీతం లేదా బోనస్ పెరిగితే EMI మొత్తాన్ని పెంచడం.
- అసలు మొత్తాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు.
- ఉదాహరణ: ₹50 లక్షల రుణంపై రెండు సార్లు ₹4 లక్షలు చెల్లించి EMI అలాగే ఉంచితే → రుణం 25 నెలలు ముందుగానే పూర్తవుతుంది.
- వడ్డీ ఆదా: ₹7.70 లక్షలు
4. గృహ రుణ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్
- మీ బ్యాంకు వడ్డీ తగ్గించకపోతే, తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుకు రుణం బదిలీ చేయండి.
- EMI, మొత్తం వడ్డీ రెండింటిలోనూ సేవింగ్స్ వస్తాయి.
- ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఖర్చులు గమనించాలి.
5. స్థిర వడ్డీ నుండి ఫ్లోటింగ్ వడ్డీకి మారడం
- ఫ్లోటింగ్ రేటు, రెపో రేటుతో ముడిపడి ఉంటుంది.
- రెపో రేటు తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.
- దీని వలన EMI భారం తగ్గుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu