Heavy Rains in Telangana: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వర్షాల హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రెడ్ అలర్ట్ జిల్లాలు..
- భూపాలపల్లి
- ములుగు
- మహబూబాబాద్
- భద్రాద్రి కొత్తగూడెం
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు
ఆదిలాబాద్ , కుంబం ఆసిఫాబాద్ , నిర్మల్ , జగిత్యాల ,మంచిర్యాల ,సూర్యాపేట ,ఖమ్మం , వరంగల్ ,హన్మకొండ ,కరీంనగర్ , పెద్దపల్లి
ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Heavy Rains in Telangana ప్రజలకు సూచనలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- వాగులు, వంకలు, చెరువులు దాటరాదు.
- అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదు.
- స్థానిక అధికారుల సూచనలు పాటించాలి.
వాతావరణ శాఖ ఈ వర్షాల కారణంగా తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశముందని, రవాణా అంతరాయాలు ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది.
Read More: Read Today’s E-paper News in Telugu