Happy Life Book Launch 2025 – మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ.!

Telanganapatrika (July 15): Happy Life Book Launch 2025 – మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించిన హ్యాపీ లైఫ్ పుస్తకం, వ్యక్తిత్వ వికాసం పై ఆధారితం.

Join WhatsApp Group Join Now

Happy Life Book Launch 2025 by Minister Ponnam Prabhakar – Personality Development in Telugu

Happy Life Book Launch 2025.

మఠంపల్లి లో, హ్యాపీ లైఫ్ (ఇంగ్లీష్)పుస్తకావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎన్ని సంపదలు ఉన్నా జీవితంలో సంతోషం లేకపోతే ఆ జీవితంపరిపూర్ణం కాదని తెలంగాణా రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

పుస్తక వివరాలు:

  • ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత టి. వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ విజయార్కె కలిసి రాసిన వ్యక్తిత్వ వికాస రచన “హ్యాపీ లైఫ్ – మీ ఆనందం మీ చేతుల్లో” పుస్తకాన్ని తెలంగాణ రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.

మంత్రివర్యుల వ్యాఖ్యలు:

  • ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పుస్తకాల అవసరం ఉందని, ఈ పుస్తకం జీవితంలో సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సమాజానికి అవసరమయ్యే హ్యాపీ లైఫ్ పుస్తకాన్ని రాసిన రచయితలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు.

రచయితల మాటలు:

  • పుస్తక రచయితల్లో ఒకరైన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల పాటు శ్రమించి సంతోషకరమైన జీవితానికి ఉపయోగపడే ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచాం. జీవితంలో కోల్పోతున్న సంతోషాన్ని మీకు ఈ పుస్తకం పరిచయం చేస్తుంది అన్నారు.
  • రచయిత విజయార్కె మాట్లాడుతూ సంతోషం లేని జీవితం, ఆత్మ లేని దేహం లాంటిది. సంతోషాన్ని మించిన సంతృప్తి లేదు. అలాంటి సంతోషకరమైన జీవితాన్ని మీకు ఈ పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం చేశామని అన్నారు.

తెలంగాణా రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గూర్చి మరింత సమాచారం కోసం, వారి వికీపీడియా పేజీని చూడండి.

మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — తెలంగాణపత్రికలో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, పబ్లిక్ ఇంటరెస్ట్‌కు సంబంధించిన తాజా, విశ్లేషణాత్మక వార్తలు నిమిత్తంగా అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *