Hanamkonda ACB raid: హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అర్రమాడ వెంకట్ రెడ్డిపై ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా కూడా ఉండగా, ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు.

ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.7.69 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇవి ఆయనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలింది.
Hanamkonda ACB raid ఏసీబీ సోదాల్లో బయటపడ్డ ఆస్తులు
సోదాల సందర్భంగా వెలుగులోకి వచ్చిన స్థిరాస్తుల్లో
2 ఇళ్లూ, 1 విల్లా, 1 ఫ్లాట్ – రూ.4.65 కోట్లు
1 కమర్షియల్ షాప్ – రూ.60 లక్షలు
8 ఓపెన్ ప్లాట్లు – రూ.65 లక్షలు
14.25 ఎకరాల వ్యవసాయ భూమి – రూ.50 లక్షలు
అధికారిక విలువతో పోలిస్తే, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ పేర్కొంది.
స్వాధీనం చేసుకున్న చరాస్తులు
అదేవిధంగా చరాస్తులుగా
- నగదు – రూ.30 లక్షలు
- బ్యాంకు నిల్వలు – రూ.44 లక్షలకు పైగా
- గృహోపకరణాలు – రూ.11 లక్షలు
- 3 కార్లు – రూ.40 లక్షలు
- 297 గ్రాముల బంగారు ఆభరణాలు
మొత్తంగా ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.7,69,38,332గా ఏసీబీ అంచనా వేసింది.
Hanamkonda ACB raid మరింత విచారణ కొనసాగుతోంది
వెంకట్ రెడ్డి గతంలో ఓ ఏసీబీ ట్రాప్ కేసులో చిక్కుకోవడంతో మొదట ప్రాథమిక తనిఖీలు చేపట్టారు. తాజాగా మంగళవారం మళ్లీ విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఇంకా ఇతర ఆస్తులు ఉన్నాయా? అక్రమ సంపాదన ఎంత మేరకు జరిగిందన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ప్రజలకు ఏసీబీ సూచన
ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగితే
- టోల్ ఫ్రీ నంబర్: 1064
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
Read More: Read Today’s E-paper News in Telugu
