Half Day Schools Telangana: Telanganaలోని పాఠశాలలు మార్చి 16 నుంచి హాఫ్ డే విధానంలో కొనసాగనున్నాయి. మార్చి 15 ఆదివారం కావడంతో కొత్త సమయాలు మార్చి 16 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇకపై పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు అందించనున్నారు.
Half Day Schools Telangana SSC పరీక్షా కేంద్రాల ప్రత్యేక ఏర్పాట్లు
SSC పబ్లిక్ పరీక్షలకు కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి. పరీక్షలు ఉదయం సెషన్‌లో నిర్వహించబడతాయి.
పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ముందుగా మధ్యాహ్న భోజనం అందించి, ఆ తరువాత తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తైన తర్వాత, ఆ పాఠశాలలు మామూలుగా ఉదయం 8 నుంచి 12.30 వరకు కొనసాగుతాయి.
Half Day Schools Telangana వేసవి సెలవులు ఎప్పుడు?
వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం 2026-27 జూన్ 12న ప్రారంభమవుతుంది.
రంజాన్ నేపథ్యంలో ఉర్దూ పాఠశాలల సమయాల్లో మార్పు
రంజాన్ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఉర్దూ మాధ్యమ పాఠశాలలు మరియు జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIETs) సమయాల్లో మార్పులు చేసింది.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఈ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పనిచేయవచ్చు.
తరగతుల నష్టం పూడ్చుకునేందుకు పండుగ తర్వాత అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
అప్‌పర్ ప్రైమరీ మరియు హై స్కూల్స్‌లో రోజుకు ఒక గంట ప్రైమరీ పాఠశాలల్లో రోజుకు అరగంట అదనంగా నిర్వహించాలి
Read More: Read Today’s E-paper News in Telugu
