
TELANGANA PATRIKA(MAY28) , సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్ వై జంక్షన్ నుంచి జెబిఎస్ వరకు రోజూ భారీగా వాహనాలు నడుస్తున్నాయి. ఈ మార్గంలో లోతుకుంట జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న భారీ చెట్టు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ వచ్చింది.
ACP ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
ఈ సమస్యపై స్పందించిన పశ్చిమ మండల ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజ్ గారి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎల్. మధు బాబు నాయకత్వంలో చెట్టును పైకి తీసి మరో ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. చెట్టును పూర్తిగా తీసివేయకుండా అల్వాల్ ఐటీఐ కాలేజ్ ఆవరణలో మళ్లీ నాటడం వల్ల చెట్టు జీవితం కొనసాగించే అవకాశం లభించింది.
పూజలు, అలంకరణల మధ్య ఘనంగా పునఃప్రారంభం
చెట్టును కొత్తగా నాటిన అనంతరం పూజలు, అలంకరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, కంటోన్మెంట్ బోర్డు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మరియు వాటర్ ఫౌండేషన్ సభ్యులు ఉదయ్ కృష్ణ, మదన్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చర్య ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా, పర్యావరణాన్ని కాపాడేందుకు Hyderabad నగరం ముందడుగు వేసింది.


Read More: Read Today’s E-paper News in Telugu