Telanganapatrika (జూలై 19) : Green Day Celebration in Schools 2025 – కరీంనగర్ బ్లూ బెల్స్ స్కూల్‌లో గ్రీన్ డే వేడుకలు ప్రకృతి ప్రేమను ప్రేరేపించేలా ఘనంగా జరిగాయి.

Green Day Celebration in Schools 2025.
బ్లూ బెల్స్ హై స్కూల్ లో గ్రీన్ డే వేడుకలు. సందర్భంలో, స్థానిక హనుమాన్ నగర్‌లోని బ్లూ బెల్స్ హై స్కూల్‌లో శనివారం గ్రీన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. ప్రకృతిని ప్రేమించాలనే సందేశంతో “గో గ్రీన్ – గ్రోత్ గ్రీన్” అనే థీమ్ ఆధారంగా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం
ఈ వేడుకలకు స్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ జంగ సునీతా మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఆకట్టుకునే ఫ్యాన్సీ డ్రెస్సుల్లో పాల్గొన్నారు. పాఠశాల మొత్తం పచ్చని రంగులతో అలంకరించబడింది. విద్యార్థులు పచ్చని పండ్లు, మొక్కలు, పునర్వినియోగ సాధనాలు తీసుకురావడం ద్వారా ప్రకృతిపై తమ ప్రేమను చాటారు.
పాటలు, నృత్యాలు, ఉపన్యాసాల ద్వారా విద్యార్థులు పర్యావరణంపై తమ అవగాహనను తెలియజేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుల కృషిని కొనియాడింది.
ఈ విద్యార్థుల్లో పర్యావరణం పట్ల చైతన్యాన్ని పెంచడంలో ఒక విజయం గా నిలిచింది
Read More: Free coaching in minority study circle 2025 : ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.