
Telanganapatrika (జూలై 11) : GPO Notification 2025 Released, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ గ్రామ పాలనాధికారి పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతలో 10,954 ఖాళీల భర్తీకి మార్చి 29న నోటిఫికేషన్ విడుదల కాగా, దానికి 5,000 మంది దరఖాస్తు చేశారు. వారి లోపు 3,550 మందిని ఎంపిక చేశారు.
GPO Notification 2025 Released
ఇప్పుడు మిగిలిన 7,404 పోస్టుల భర్తీ కోసం పూర్వ వీఆర్ఎ, వీఆర్వోల నుండి జూలై 16వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా జూలై 27న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు గ్రామ పాలనాధికారి పదవిని అందించనున్నారు.
Read Also: Railway Jobs 2025 : రైల్వేలో 50,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన!
గ్రామ స్థాయిలో ప్రజలతో ప్రత్యక్షంగా పని చేయాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!