Governor Nizamabad Visit 2025- తెలంగాణ గవర్నర్ పర్యటన!

Telanganapatrika (July 16) : Governor Nizamabad Visit 2025 – నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి ఘన స్వాగతం, మొక్కలు నాటారు, విశ్వవిద్యాలయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp Group Join Now

Governor Jishnu Dev Varma Nizamabad Visit July 2025

Governor Nizamabad Visit 2025.

రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం

  • నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11.05 గంటలకు డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్ కు చేరుకున్న గవర్నర్‌ను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
  • రాజ్యసభ సభ్యులు కేఆర్. సురేష్ రెడ్డి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి తదితరులు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు.
  • పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, బెటాలియన్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ మొక్కలు నాటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్ లో గవర్నర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి చేరుకుని, స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
  • గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన వివరాలు అక్కడే లభిస్తాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *