TELANGANA PATRIKA (MAY 8) , Government Schools Telangana: సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలందర్లో ఒక నెల లోపు తప్పనిసరిగా టాయిలెట్లు, బాత్రూములు నిర్మించాలి అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

Government Schools Telangana మౌలిక వసతులపై కలెక్టర్ ఫోకస్
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్య శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ:
“కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ టాయిలెట్లు లేకపోవడం దారుణం. ఈ పరిస్థితి వెంటనే మారాలి. స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి మౌలిక వసతులు అందుబాటులోకి రావాలి.”
విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన సదుపాయాలు:
ఆడపిల్లలు మరియు మగపిల్లలకు వాష్‌రూం సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యపై దృష్టి తగ్గే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. టాయిలెట్లు లేని పాఠశాలల వివరాలను సేకరించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇతర సూచనలు
- వంటగది ప్రహరి గోడలు నిర్మించాలి
- గ్రామాల్లో సిసి రోడ్లు పూర్తి చేయాలి
- గురుకుల పాఠశాలల్లో వాటర్ ట్యాంక్ శుభ్రత పాటించాలి
- మిషన్ భగీరథ ద్వారా నీరు అందించాలి
- అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలి
- గ్రామపంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో కొత్త భవనాలు నిర్మించాలి
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈవో జానకి రెడ్డి, పంచాయతీరాజ్ అధికారి సాయిబాబా, పిడిఆర్డిఏ జ్యోతి, వైద్యాధికారిణి గాయత్రీ దేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read : Operation Sindhoor Support Rally Rajanna Siricilla: భారత త్రివిధ దళాలకు న్యాయవాదుల మద్దతు
Comments are closed.