Telanganapatrika (July 8): Google AI Mode India 2025, తెలుసుకోవాలసినది ఏమంటే, ఇప్పుడు మీరు Google Labsలో ముందుగా నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే, Google AI Modeను నేరుగా ఉపయోగించవచ్చు. సెర్చ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఈ మోడ్ రూపుదిద్దుకుంది.

AI మోడ్ ప్రత్యేకతలు:
Gemini 2.5 మోడల్ ఆధారంగా, Google ఇప్పుడు మరింత సమగ్రమైన, సంబంధిత సమాధానాలను అందిస్తోంది.వాయిస్ లేదా టైప్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు.
Google Lens సహాయంతో చిత్రాన్ని షేర్ చేసి, దానికి సంబంధించిన సమాచారం తక్షణమే పొందవచ్చు.
ఫాలో-అప్ ప్రశ్నలు అడిగినా, AI ముందుగా మీరు అడిగిన కంటెంట్‌ను గుర్తుంచుకుని సమాధానం ఇస్తుంది.
Google AI Mode India 2025 ఇది ఎలా ఉపయోగపడుతుంది?
ఉదాహరణకు, మీరు “తెల్లవారుజామున వ్యాయామం శరీరానికి ఎలా మంచిది?” అని అడిగితే, AI మోడ్ శాస్త్రీయంగా వివరిస్తుంది. తరువాత మీరు “రాత్రి వాకింగ్ మంచిదా?” అని అడిగినా, మొదటి ప్రశ్నకు సంబంధించిన విషయాన్ని గుర్తుంచుకుని సమగ్రమైన సమాధానం ఇస్తుంది.
ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది?
Google తాజాగా ఈ మోడ్‌ను భారత్‌లో అందరికీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది ఇంగ్లిష్ భాషలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర భాషల్లోకి విస్తరించనుంది.
వినియోగదారులందరికీ త్వరితగతిన, సమగ్రమైన సెర్చ్ అనుభవం అందించడమే Google లక్ష్యం. కొత్త AI మోడ్ ద్వారా, మీరు ఇకపై సాధారణ సెర్చ్‌కు మించి ప్రశ్నలను అడగవచ్చు, కాంటెక్స్ట్‌తో కూడిన సమాధానాలను పొందవచ్చు
తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి