Telanganapatrika: Ganesh Nimajjanam Hyderabad, హైదరాబాద్ లో ఈ సంవత్సరం గణేశ్ నిమజ్జన సంబరాలకు ప్రత్యేకత చేకూర్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సెప్టెంబర్ 6, 2025న జరిగే ప్రధాన నిమజ్జన ఊరేగింపులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రారంభించి, ప్రధాన ఊరేగింపులో ప్రత్యక్షంగా పాల్గొంటారు.

బాలాపూర్ లడ్డూ వేలం నుండి ఊరేగింపు వరకు
అమిత్ షా హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ మండపం కు చేరుకుని, ప్రతి సంవత్సరం ప్రసిద్ధి చెందిన లడ్డూ వేలాన్ని ప్రారంభిస్తారు. ఈ వేలం తర్వాత ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపులో ఆయన పాల్గొంటారు. ఊరేగింపు చార్మినార్, ఎంజే మార్కెట్ వంటి కీలక ప్రాంతాల గుండా సాగి హుస్సైన్ సాగర్ కు చేరుకుంటుంది.
కామారెడ్డి జిల్లాలో సందర్శన
అదే రోజు, అమిత్ షా కామారెడ్డి జిల్లా ను సందర్శించనున్నారు. ఈ సందర్శన ప్రాంతీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి వరద బాధితులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
Ganesh Nimajjanam Hyderabad భద్రతా ఏర్పాట్లు ముమ్మరం
అమిత్ షా సందర్శన ప్రత్యేకత దృష్టిలో ఉంచుకుని, పోలీసులు అత్యున్నత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్ స్కానింగ్, సీసీటీవీ మానిటరింగ్, స్నైపర్స్, స్పెషల్ ఫోర్సెస్ ను మోహరించారు. ఊరేగింపు మార్గాల్లో బ్యారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాట్లు కూడా చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
