Telanganapatrika (July 29): Gambhiraopet, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యా మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ ( డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ ) చివరి అవకాశంగా ప్రభుత్వం మరో షెడ్యూల్డ్ ప్రకటించిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీమతి.వి.విజయలక్ష్మి తెలిపారు.

Gambhiraopet వదలకండి మీ భవిష్యత్తు..
ఇంటర్ ఉత్తీర్ణత కలిగి డిగ్రీలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు చివరి అవకాశం కల్పిస్తున్నారని ఈరోజు నుండి ఈ నెల 31 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వచ్చే నెల మూడో తారీఖున సీట్ల భర్తీ ఉంటుందని, ఆరో తారీకు వరకు కళాశాలలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో సంప్రదించగలరని పేర్కొన్నారు. కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కొరకు విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ వారి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ తో అనుసంధానం చేసుకొని ఉండాలని, దోస్త్ రిజిస్ట్రేషన్ కొరకు పదో తరగతి మెమో, ఇంటర్ రెండవ సంవత్సర హాల్ టికెట్ నెంబర్, కుల దృవీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం 01- 4 -2025 తేదీ తర్వాత తీసుకొని ఉండాలని, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకొని రావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu