Telanganapatrika (July 05): Free Tailoring, మహిళలు ఆర్థికంగా స్వావలంబులై “మహారాణులు”గా ఎదగాలని ఆకాంక్షిస్తూ, బోథ్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రామ నంద తీర్థ సాయి సేవా సౌజన్యం మరియు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధాన అతిథులుగా ఎంపీడీఓ రమేష్, ఎస్సై ప్రవీణ్, ఎంపీఓ అతుల్, బ్యాంక్ మేనేజర్ శైలేజ, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Free Tailoring మహిళలు మహారాణులు కావాలి” – ఎంపీడీఓ రమేష్
ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ మాట్లాడుతూ:
“మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నేను హాజరయ్యాను. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకే నిజమైన విలువ ఉంటుంది. అమ్మ పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి సేవ చేయడం గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ శిక్షణ మహిళలకు మంచి ఉపాధిని కల్పిస్తుంది.” అని తెలిపారు.
ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ:
“మహిళలు స్వయం సమర్ధులై మహారాణులుగా ఎదగాలి. కుట్టు శిక్షణ వంటి హుందా దిశలో అడుగులు వేయడం అభినందనీయం. ఎవ్వరూ ఈ అవకాశాన్ని కోల్పోకండి. ప్రతి రోజు హాజరై 90 రోజుల కోర్సును పూర్తి చేయండి.” అని సూచించారు.
అభ్యర్థులకు గొప్ప అవకాశాలు
ఈ శిక్షణలో ప్రతి రోజు కుట్టు విద్యను నేర్చుకునే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో మోడ్రన్ ఫ్యాషన్ రంగంలో ఇది డిమాండ్ పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
అలాగే, ఇటీవల మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన అగ్నివీర్, ఆర్మీ ఉచిత పరీక్షలో 100కి 88 మార్కులతో మొదటి స్థానం సాధించిన బోయడి ఆకాష్ను అధికారుల ద్వారా సన్మానించారు.
Read More: Read Today’s E-paper News in Telugu