Telanganapatrika (July 05) : Free B.Tech seat , తెలంగాణలో ప్రభుత్వ విద్యకు కొత్త శకం వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడానికై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా — ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ సీటు పొందితే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది.

Free B.Tech seat
ఇంటర్ ప్రభుత్వ కళాశాలలో చదివితే — ఇంజినీరింగ్ ఫీజు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది!
ఈ ఆదేశాలు గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు వంటి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారికి కూడా వర్తిస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సామాన్య వర్గాలపై ఉన్న నిబద్ధతను చూపించే ఉదాహరణగా నిలుస్తోంది. పేద కుటుంబాలకు ఇది ఓ వరం కాగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నూతన ఆశ వెలుగులు తెచ్చే చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఒక్క ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలయ్యేది. కానీ ఇప్పుడు సర్కారు విద్యాసంస్థల్లో చదవడమే క్రైటీరియా అవుతోంది — ఇది విద్యలో సామాన్యులకు న్యాయం చేయాలనే లక్ష్యంను సూచిస్తుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
