Telanganapatrika (July 30): ఓగ్గు నర్సయ్య డిమాండ్, సిద్ధిపేట నుండి గంగాధర ఎక్స్ రోడ్ వరకు నాలుగు లైన్ల రహదారి మంజూరు చేయాలని హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫ్యాక్స్ ద్వారా తెలిపామని మాజీ ఎంపీటీసీ ఓగ్గు నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట నుండి వాణిజ్యం, రవాణా మరియు తీర్థయాత్రలకు కీలకమైన జగిత్యాల, మెట్ పల్లి మరియు కోరుట్ల వంటి కీలక పట్టణాల మధ్య ప్రయాణ దూరం తగ్గుతుందని. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డుకు 152 కోట్లు మంజూరు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని. కేంద్రం నుండి నిధులను మంజూరు చేయించి రోడ్డు నిర్మాణం పనులు జరిగే విధంగా కృషి చేయాలని బండి సంజయ్ ని కోరడం జరిగిందని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu