Telanganapatrika (July 14): Fourlane Project , హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ఫోర్‌లేన్ నిర్మించాలని ప్రభుత‍్వం నిర్ణయించిన విషయం తెల్సిందే.అయితే రోడ్డు విస్తరణతో తాము ఇళ్లు కోల్పోతున్నామని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామస్తులు అంటున్నారు. Fourlane Project రోడ్డు విస్తరణతో ఇళ్లు పూర్తిగా కోల్పోతున్నామని,గ్రామం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరుతున్నారు.

Fourlane Project వద్దు సుందరగిరి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం..!
గ్రామం మీదుగా రోడ్డు వద్దంటూ ఇటీవల హుస్నాబాద్ – కరీంనగర్ రహదారిపై ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. తాజాగా సోమవారం సుందరగిరి గ్రామంలోని రైతువేదికలో సమావేశమై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులందరూ హాజరై గ్రామం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.రోడ్డు విస్తరణతో రూ.లక్షలు వెచ్చించి కటు‍్టకున్న ఇళ్లు కోల్పోతామని,తమకు ఆధారమే లేకుండా అవుతుందని తెలిపారు.తమ ఆవేదనను గుర్తించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టవద్దని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి,మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేశ్ తదితరులు హాజరయ్యారు.ఇళ్లు కోల్పోతున్న ప్రజలు వందలాదిగా తరలివచ్చారు.
Read More: Read Today’s E-paper News in Telugu