Telanganapatrika (July 19): Fish Venkat , తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వించిన ఫిష్ వెంకట్ ఇకలేరు. కిడ్నీ వ్యాధితో పోరాడిన ఆయన, తగిన చికిత్స లేక కన్నుమూశారు. ఆర్థిక సాయం ఉన్నా, దాత లేకపోవడమే మృ*త్యుకి ప్రధాన కారణమైంది. తెలుగు సినిమాల్లో కామెడీ టచ్ ఇచ్చే పాత్రలతో పాపులర్ అయిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Fish Venkat కిడ్నీ దాతల లేకపోవడమే ప్రధాన కారణం….
నెల రోజుల క్రితం ఆయనకు రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఉందని తెలిపారు. దానికి సుమారు ₹50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు.
ఆయన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి పలువురు ముందుకొచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఆసుపత్రికి వచ్చి పరామర్శించి, ప్రభుత్వం అన్ని వైద్య ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ అతికష్టం మీద ఏర్పడిన డబ్బుతో కూడి, ఒక కిడ్నీ దాత దొరక్కపోవడం వల్ల చికిత్స వాయిదా పడింది.
ఈలోగా వెంకట్ ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరికి, ఆయన శరీరం సహకరించక కన్నుమూశారు. ఇది కేవలం ఒక నటుడి కోల్పోవడం మాత్రమే కాదు, కిడ్నీ దానం వంటి అంశాలపై సామాజికంగా కూడా మనల్ని ఆలోచింపజేసే ఘటన.
Read More: Read Today’s E-paper News in Telugu
4 Comments on “Fish Venkat : ఫిష్ వెంకట్ మృ*తికి కారణం ఇదే..!”