TELANGANAPATRIKA (June 15) : First Woman RTC Driver Telangana. తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) చరిత్రలో మరో మైలురాయి నెలకొంది. తొలి మహిళా డ్రైవర్‌గా సరిత బాధ్యతలు స్వీకరించగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమెను స్వయంగా అభినందించారు.

First Woman RTC Driver Telangana మహిళలు ఎక్కడైనా రాణించగలరని సరిత నిరూపణ
‘‘ఒక అవకాశం వస్తే, మహిళలు ఏ రంగంలోనైనా ముందంజ వేయగలరు’’ అని సీఎం రేవంత్ అన్నారు. సరిత తీసుకున్న ధైర్యమైన నిర్ణయం, ఆమె సాధించిన విజయాన్ని సీఎం ప్రశంసించారు. ఇది రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
RTC బస్సులకు మహిళలనే ఓనర్లు – డ్రైవర్ పోస్టులోనూ ముందడుగు
CM రేవంత్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వం చేపట్టిన “ఇందిరా మహిళా శక్తి” పథకం ద్వారా మహిళల స్వయం సహాయక సంఘాలకు (SHGs) బస్సులను కేటాయిస్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ పోస్టులో మహిళల ప్రవేశం మరో కీలక ముందడుగు అని అభివర్ణించారు.
సామాజిక మార్పుకు శుభసూత్రం
ఇది కేవలం ఉద్యోగ నియామకమే కాదు, మహిళల సామాజిక పురోగతికి శుభసూత్రం అని ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని మహిళలు రవాణా రంగంలోకి రావాలని కోరుతూ, సరితను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Read More: Read Today’s E-paper News in Telugu