Telanganapatrika (August 11): Fatima College, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ FTL (Full Tank Level) పరిధిలో ఉన్నప్పటికీ, హైడ్రా యంత్రంతో కూల్చకపోవడంపై వస్తున్న విమర్శలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు.

Fatima College “మతరంగు పూసి తప్పుడు ప్రచారం”…
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.
“కొంతమంది మతం రంగు పూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేదలకు మంచి జరిగితే దానిని అలాగే వదిలేయాలి. మానవీయ కోణంలోనే ఆ కాలేజీని కూల్చలేదు” అని స్పష్టం చేశారు.
మూసీ సుందరీకరణ – పునరావాస చర్యలు..
మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు.
పునరావాసం, ఆర్థిక సహాయం, మరియు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి పేర్కొన్నారు.
Fatima College నేపథ్యం..
ఫాతిమా కాలేజీ FTL పరిధిలో ఉందనే కారణంతో కూల్చాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
అయితే, భట్టి విక్రమార్క ప్రకారం, ఈ నిర్ణయం మానవీయ పరామర్శ దృష్ట్యా తీసుకున్నారు, రాజకీయ లేదా మతపరమైన ఉద్దేశ్యం ఏదీ లేదని చెప్పారు.
Read More: Read Today’s E-paper News in Telugu