Telanganapatrika (August 16): FASTAG Annual Pass, దేశంలో వాహనదారుల ప్రయాణం సులభం కానుంది. NHAI కొత్తగా ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్తో కేవలం రూ.3,000 చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ ఫీజులు లేకుండా ప్రయాణం చేయవచ్చు.

FASTAG Annual Pass వాహనదారులకి బిగ్ రిలీఫ్
దేశంలో రహదారులపై ప్రయాణం ఇప్పుడు మరింత సులభం కానుంది. ఇక టోల్ ప్లాజా వద్ద ఆగి డబ్బులు చెల్లించే అవసరం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆగస్ట్ 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 1,150 టోల్ ప్లాజాల్లో ఈ పాస్ అమల్లోకి వచ్చింది. మొదటి రోజే 1.4 లక్షల మంది వాహనదారులు పాస్‌ను యాక్టివేట్ చేశారు.
ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏంటి?
- ఒక్కసారి రూ.3,000 చెల్లిస్తే
- 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ట్రిప్పుల వరకు ఫ్రీ ప్రయాణం
- నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తింపు
- FASTag ఉన్న వాహనాలకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది
పాస్ ఎలా కొనాలి?
- మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే FASTag ఉండాలి.
- Rajmargyatra యాప్ లేదా NHAI వెబ్‌సైట్లో రూ.3,000 చెల్లించి పాస్ కొనవచ్చు.
- పేమెంట్ చేసిన 2 గంటల్లోపే పాస్ యాక్టివేట్ అవుతుంది.
FASTAG Annual Pass వార్షిక పాస్ బెనిఫిట్స్..
- ప్రతి సారి FASTag రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.
- ఏడాది పాటు టోల్ గేట్ల వద్ద ఎటువంటి అంతరాయం లేకుండా ప్రయాణం.
- డబ్బులు ఆదా అవ్వడం తో పాటు సమయాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు.
- ప్రస్తుతం దేశంలో 8 కోట్లకు పైగా FASTag యూజర్లు ఉండటంతో ఈ పాస్ డిమాండ్ పెరుగుతోంది.
Read More: Read Today’s E-paper News in Telugu