Telanganapatrika (July 10) : Fake Police Arrest, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ పాత్రికా సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలోని ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీసులు, దొంగ బంగారం కొన్నారు అంటూ బంగారు దుకాణ యజమానులతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాలలో: మొదటి కేసు
2025 జూన్ 27న ఇచ్చోడ ఎస్‌ఐ వి. పురుషోత్తం కి కొండొజు నరసింహచారి (రంగారెడ్డి నివాసి) అనే వ్యక్తి ఫోన్ చేసి, తన సోదరుడు చేపురి సతీష్ కుమార్‌కు 6301395160 నంబర్ నుండి కాల్ వచ్చిందని, అవతలి వ్యక్తి తాను ఇచ్చోడ పీఎస్ ఎస్‌ఐ నర్సిరెడ్డిని అని పరిచయం చేసుకుని, నాలుగు సంవత్సరాల క్రితం 11 గ్రాముల దొంగ బంగారం కొన్నారని, కేసు కాకుండా ఉండాలంటే ఫోన్‌పే/గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని చెప్పారని ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చి, ఎస్‌ఐ ఇచ్చోడ అధికారిక నంబర్‌కు ఫోన్ చేయగా, అది నకిలీ పోలీసు అని తెలిసింది. వెంటనే ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.
Fake Police Arrest రెండవ కేసు.
దర్యాప్తు కొనసాగుతుండగా, 2025 జూలై 4న రుద్రంగి కిరణ్ కుమార్ (హైదరాబాద్ నివాసి) అనే వ్యక్తి ఇచ్చోడ ఎస్‌ఐకి ఫోన్ చేసి,
బాధితునికి 9866193420 నంబర్ నుండి కాల్ చేసి ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానని బుకాయించి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి డబ్బులు పంపమని కోరగా, గూగుల్ పే ద్వారా రూ.150 పంపినట్లు తెలిపారు. తర్వాత అనుమానం వచ్చి ఎస్‌ఐ ఇచ్చోడ కు తెలియజేయగా, అది కూడా నకిలీ పోలీసు అని తెలిసింది. రెండవ కేసు వెంటనే ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.
కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగా, సాంకేతిక ఆధారాల ద్వారా నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వివరాలు:
- ఏ1. షేక్ ఇర్ఫాన్ (వయస్సు: 24 సం., వృత్తి: పశువుల వ్యాపారం, నివాసం: నిడమనూరు గ్రామం, ప్రస్తుతం మాన్యం చల్క, నల్గొండ)
- ఏ2. చింతలచెరువు ప్రశాంత్ (వయస్సు: 24 సం., వృత్తి: లారీ క్లీనర్, నివాసం: నిడమనూరు గ్రామం, నల్గొండ జిల్లా)
- ఏ3. బదనపూరి అజయ్ (వయస్సు: 29 సం., వృత్తి: మోటార్ మెకానిక్, నివాసం: నిడమనూరు, నల్గొండ జిల్లా)
- ఏ4. బొప్పం సుధాకర్ (వయస్సు: 28 సం., వృత్తి: సెల్ పాయింట్, నివాసం: వెంకటాపురం, నిడమనూరు గ్రామం, నల్గొండ జిల్లా)
- ఏ5. వోట్కూరి నరేష్ (పెట్రోల్ బంకు ఉద్యోగి) (పరారీ).
నిందితుల విచారణలో షేక్ ఇర్ఫాన్ తన నేరాన్ని అంగీకరించాడు. తాను జల్సాలకు అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ ద్వారా నగల షాపుల వివరాలు తెలుసుకుని వారికి కాల్ చేసి, తాను ఎస్‌ఐని అని, రెండు సంవత్సరాల క్రితం ఒక జంట వద్ద నుండి 11 గ్రాముల దొంగ బంగారం కొన్నారని, మీపై కేసు నమోదు అవుతుందని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడినని తెలిపాడు. ఈ నేరంపై గతంలో 2023లో నల్గొండ-II టౌన్‌లో క్రైమ్ నంబర్ 123/2023, సెక్షన్ 419, 384 ఐపీసీ కింద, 2025లో హుజూర్‌నగర్ పీఎస్‌లో క్రైమ్ నంబర్ 50/2025, సెక్షన్ 318(4), 308(2) బన్స్ కింద కేసులు నమోదైనట్లు వెల్లడించాడు.
మార్చిలో జైలు నుండి విడుదలయ్యాక తిరిగి జల్సాలకు అలవాటు పడి, గత మూడు నెలల్లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నాడని తెలిపాడు. ఈ డబ్బులతో ఒక బెలానో వాహనం, కొనుగోలు చేసిన బుల్లెట్ మోటార్ సైకిల్ (నం. టీఏస్ 11ఈయూ 2405), బజాజ్ మాక్సిమా ఆటోరిక్షా, 1.36 గ్రాముల బంగారం, 14 తులాల వెండి కాలిపట్టీలను తన భార్యకు ఇచ్చినట్లు తెలపగా, అదేవిధంగా మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎ2 చింతలచెరువు ప్రశాంత్ తన లారీ క్లీనర్ పని చేస్తూ, గూగుల్ మ్యాప్స్‌పై అవగాహన ఉండటంతో షేక్ ఇర్ఫాన్‌తో కలిసి జ్యువెలరీ షాపుల వివరాలను తన ఫోన్‌లో చూసి, యజమానుల నంబర్‌లు తీసుకుని వారికి పోలీసులు అని ఫోన్ చేసి బెదిరించి, ఇర్ఫాన్ డబ్బులు వసూలు చేయగా తనకు కొంత డబ్బు ఇచ్చేవాడని ఒప్పుకున్నాడు. ఎ3 బదనపూరి అజయ్, ఎ1, ఎ2లతో స్నేహం చేసి వారి నేరాలకు సహకరించాడు. ఎ4 బొప్పం సుధాకర్ తన మొబైల్ షాపులో ఈ డబ్బులను తన అకౌంట్‌లో జమ చేయించుకుని, ఆ డబ్బులను ఎ1కు ఇచ్చాడు. ఎ5 వోట్కూరి నరేష్ పెట్రోల్ బంకులో పని చేస్తూ, ఎ1 ఇర్ఫాన్ తన (నరేష్) ఖాతాలోకి డబ్బులు పంపించగా, వాటికి కమీషన్ తీసుకుని ఇర్ఫాన్‌కు ఇచ్చాడు. ఈ డబ్బులు దొంగ డబ్బులని తెలిసీ కూడా ఎ1 ఇర్ఫాన్‌కు సహకరించాడు.
పైన పేర్కొన్న నిందితులను న్యాయమూర్తి రిమాండ్‌కు పంపడం జరిగింది. ప్రజలు ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ వి పురుషోత్తం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.