Telanganapatrika (July 04): Fake News Content , దేశానికి వ్యతిరేకంగా కంటెంట్‌ను రూపొందిస్తున్న వారిపై కేంద్రం గట్టి చర్యలు తీసుకోనుంది. ఈ దిశగా కేంద్ర హోంశాఖ కొత్త పాలసీ తయారు చేస్తున్నట్లు సమాచారం.

సోషల్ మీడియా పై కేంద్రం నజరు
సమాచారం ప్రకారం, వెబ్‌సైట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై పోస్ట్ చేసే కంటెంట్‌ను సవివరంగా పరిశీలించేందుకు ప్రత్యేక నిఘా బృందం (monitoring team) నియమించనుంది. దేశవ్యతిరేక పోస్ట్‌లను గుర్తించి ఆయా ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయడం, అలాగే కన్సర్న్ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Fake News Content మత విద్వేషాలు, ఫేక్ న్యూస్‌పై ఫోకస్
ఈ పాలసీ లక్ష్యం దేశంలోని శాంతిని భంగం చేసే మత విద్వేషాలు, అపోహలు, ఫేక్ న్యూస్ వంటి వాటిని అరికట్టడం. కేంద్రం సూచనల మేరకు, సైబర్ నిఘా యంత్రాంగాలు ఇప్పటికే పనిలో నిమగ్నమయ్యాయి.
Read More: Read Today’s E-paper News in Telugu