Telanganapatrika (July 20): Fake Movie Links , తెలంగాణ పోలీసులు ప్రజలకు సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం అని సూచిస్తున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపుల్లో కొత్త సినిమాల పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

Fake Movie Links మీ డేటా టార్గెట్ చేస్తున్న లింకులు..!
ఇటీవలి కాలంలో కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లు “నూతన సినిమా డౌన్లోడ్” పేరుతో APK ఫైళ్లు పంపిస్తున్నాయి. అవి ఒకసారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే, వాటి ద్వారా బ్యాంకింగ్ యాప్‌లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు లాంటివన్నీ నేరగాళ్లకు చేరుతాయి.
ఈ విధంగా నమ్మి లింకులు క్లిక్ చేసిన వారిలో చాలామంది వెయ్యల నుండి లక్షల రూపాయల వరకు డబ్బు పోయిన ఘటనలు నమోదయ్యాయి.
పోలీసులు సూచించేది ఒకటే – “ఫ్రీ సినిమా కోసం ఫోన్, డబ్బు పోగొట్టుకోవద్దు..!” నిజమైన ఓటీటీలు, థియేటర్లలో చూసేందుకు మాత్రమే ప్రయత్నించండి. అలానే, ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు URL చూడండి, .apk ఫైల్ డౌన్‌లోడ్ అయితే వెంటనే తొలగించండి.
Read More: Read Today’s E-paper News in Telugu
Hi
Name:Ramesh
Nadhi Telegram
ravatledhu please help me