Fake lucky draw scams Hyderabad: సోషల్ మీడియా ద్వారా ఫేక్ లక్కీ డ్రా స్కామ్‌లు పెరుగుతున్నాయంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఖరీదైన బహుమతుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గ్యాడ్జెట్లు గెలుచుకోవచ్చని ఆకర్షణీయమైన రీల్స్ రూపొందిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీపీ తెలిపారు. ఈ రీల్స్ వెనుక ఆర్థిక మోసాలు దాగి ఉన్నాయని హెచ్చరించారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఇప్పుడే అదే వ్యక్తులు ‘లక్కీ డ్రా’ల పేరుతో కొత్త మోసాలకు తెరతీస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.
Fake lucky draw scams Hyderabad Telangana
ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై Prize Chits and Money Circulation Schemes (Banning) Act, 1978 కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వారి సెలబ్రిటీ ఇమేజ్ లేదా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎంత ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అని హెచ్చరించారు.
ప్రజలు ఆన్‌లైన్‌లో కనిపించే లక్కీ డ్రా ఆఫర్లను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
