Telanganapatrika (July 18) : Employee promotion scam , జిల్లాలోని ఒక ఉన్నతాధికారి కిందిస్థాయి ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు వెలుగులోనికి వచ్చాయి. ఏకంగా ఆ శాఖ డైరెక్టర్కి ఫిర్యాదు అందింది అంటే అర్థం చేసుకోవచ్చు. తనిఖీల పేరుతో పర్యటిస్తూ ఐదు నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు కమిషనర్ స్థాయి వరకు వెళ్లిన మాట వాస్తవమే అని ఏకంగా అడిషనల్ కలెక్టర్ తెలియజేశారు.

Employee promotion scam క్రమబద్ధీకరణ వెనుక లంచామా.?
కొందరు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు అని ఆ విషయాన్ని ఒక మధ్యవర్తి ద్వారా బాధితులకు తెలియజేశాడు అని తెలిసింది. ఇట్టి ఆరోపణల విషయంలో దీనిపైన కమిటీ వేశామని ఆ కమిటీ విచారణ చేస్తుంది అని తెలియజేశారు.ఇట్టి విచారణలో కొందరు బాధితులు విచారణాధికారి ముందు నిజానిజాలు ఉన్నది ఉన్నట్టుగా డబ్బులు డిమాండ్ చేసింది వాస్తవమే అని అలాగే డబ్బులు ఇవ్వని ఎడల బెదిరింపులకు గురిచేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టారు అని దానివల్ల చాలా మానసికక్షోభ అనుభవించినట్టుగా పలువురు ఉద్యోగులు తెలియజేసినట్టు తెలుస్తుంది. అలా నిజా నిజాలను బట్టబయలు చేసినందుకు వారిని ప్రత్యామ్నాయ మార్గాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నట్టుగా వినికిడి. పూర్తి తతంగంలో ఒక క్రింది స్థాయి అధికారి ముందుకు వచ్చి బాధితులను మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కు తీసుకోవాల్సిందిగా లేదంటే వాటి వల్ల వచ్చే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా కార్యాలయంలోనే ఇటువంటి పరిస్థితులు నెలకొంటే సామాన్య జనులకు న్యాయం ఎలా దొరుకుతుంది అని అర్థం చేసుకోవచ్చు.
కమిషనర్ ఆఫీస్ నుంచి క్రమబద్ధీకరణ విషయంలో జీవో వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంకా క్రమబద్ధీకరించకపోవడానికి ఇట్టి విషయం బలం చేకూరుస్తుంది. గ్రేస్ పీరియడ్ విషయంలో మిగతా జిల్లాలలో ఇట్టి కార్యక్రమం వేగవంతంగా పూర్తవుతున్న కామారెడ్డి జిల్లాలో ఇట్టి విషయంలో అలసత్వం ఎందుకు తెలియాల్సి ఉంది. ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాలకు వెళ్లి తనిఖీల పేరుతో పలు రకాల ఇబ్బందులకు గురిచేస్తూ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వలన పనిచేయలేకపోతున్నామని అందుకే నిజాలను నిరభ్యంతరంగా విచారణ అధికారికి తెలియజేసినట్టుగా సమాచారం. ఒక కిందిస్థాయి అధికారి చేత ఎవరైతే నిజానిజాలను నిరభ్యంతరంగా కమిటీ ముందు తెలియజేశారో వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నతాధికారికి అనుకూలంగా చెప్పాలి అని ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం.
ఉద్యోగినిల పట్ల ఆ ఉన్నతాధికారి ప్రవర్తిస్తున్న తీరు ఎమ్మెల్యే వరకు వెళ్ళింది.
Employee promotion scam ఉద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం?
ఇట్టి విషయాన్ని తక్షణమే విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఉద్దేశపూర్వకంగానే ఇట్టి విచారణ మందగించింది అని సమాచారం. అసలు ఆ జిల్లా ఉన్నతాధికారికి సహాయం చేస్తు మధ్యలో వారధిగా ఉన్నటువంటి క్రింది స్థాయి అధికారి ఎవరు? జిల్లా ఉన్నతాధికారి డబ్బులు అడిగింది వాస్తవమేనా లేక ఆ జిల్లా ఉన్నతాధికారి పేరు చెప్పి మధ్యలో ఉన్నటువంటి క్రింది స్థాయి అధికారి డబ్బులు డిమాండ్ చేశాడా తెలియాల్సి ఉంది. ఇట్టి విచారణ విషయంలో బాధితులను మధ్యవర్తి ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు సమాచారం. ఇట్టి విచారణ మందగించడంతో ఈ పంచాయతీ మొత్తం కూడా మళ్లీ కమిషనర్ ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu