Telanganapatrika (July 06): The american party , ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ (X) వంటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలపై విసుగు చెందిన ప్రజలకు ప్రత్యామ్నాయంగా ‘ది అమెరికా పార్టీ’ అనే కొత్త పార్టీని ప్రకటించారు.

The american party మూడో పార్టీపై జనాదరణ
ఇంతకు ముందు మస్క్ “బిగ్ బ్యూటిఫుల్ బిల్” అనే ప్రస్తావన చేస్తూ, అది పాసైతే మూడో పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తదనంతరం ‘X’లో (మాజీ ట్విట్టర్) ఆయన పెట్టిన పోల్లో 12.48 లక్షల ఓట్లు రాగా, 65.4% మంది మూడో పార్టీకి మద్దతు తెలిపారు. ఈ ఫలితాన్ని పురస్కరించుకుని, మస్క్ ట్వీట్ చేస్తూ ఇలా అన్నారు:
“రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘ది అమెరికా పార్టీ’ ఏర్పడింది.”
ప్రజాస్వామ్యం – తిరిగి ప్రజల చేతుల్లోకి?
ఈ ప్రకటనతో అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త దిశ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కొనసాగుతున్న స్థిరమైన వర్గపోరాటానికి ప్రత్యామ్నాయంగా మస్క్ పార్టీ ఒక నూతన దృక్కోణాన్ని ప్రజలకు అందించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తనదైన శైలిలో ట్వీట్ల ద్వారా ప్రచారం
ఎలాన్ మస్క్ తాజా ట్వీట్లో “అమెరికా పార్టీ ప్రజల స్వేచ్ఛ కోసం” అనే పంథాను స్పష్టం చేశారు. ఇప్పటికే మస్క్ పలుమార్లు పాత రాజకీయ వ్యవస్థలను విమర్శించారు. AI, టెక్నాలజీ, ఫ్రీ స్పీచ్ వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు ఉండే మస్క్, ఇప్పుడు పాలనాపరంగా ఎలా మార్పులు తీసుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Read More: Read Today’s E-paper News in Telugu