Telanganapatrika (July 17) : Education Bandh Telangana 2025 – తెలంగాణ విద్యాసంస్థల్లో సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జూలై 23న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నారు.
Join WhatsApp Group
Join Now

Education Bandh Telangana 2025.
- జులై 23న విద్యాసంస్థల బంద్.!
- రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించిన వామపక్ష విద్యార్థి సంఘాలు .!!
- సిద్దిపేట జిల్లా ప్రతినిధి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు,జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్, ఏఐపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్,ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆముదాల రంజిత్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్న కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు,కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ ద్వజమెత్తారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు.
- అదే విధంగా ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు.ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలనీ,పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలనీ అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలనీ కోరారు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలనీ, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలనీ, నూతన జాతీయ విద్యా విధానాన్నీ తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జులై 23న సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు,విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యం కావాలనీ పిలుపునిచ్చారు.
- ఈ కార్యక్రమంలో పీడీఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అనిరుద్, భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి భరత్ , లెనిన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Telangana State Council of Higher Education (TSCHE) : https://www.tsche.ac.in/
(విద్యా విధాన నిర్ణయాల కోసం ప్రభుత్వ ఖచ్చితమైన వేదిక)
తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన వివరాలు అక్కడే లభిస్తాయి.