Economic Stabilisation Fund: ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Nirmala Sitharaman లోక్‌సభలో మాట్లాడుతూ ₹1 లక్ష కోట్ల ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఫండ్ ద్వారా ప్రపంచ స్థాయి ఆర్థిక సంక్షోభాలు లేదా అనూహ్య పరిస్థితులు వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
Economic Stabilisation Fund లోక్‌సభలో హంగామా మధ్య ప్రకటన
Lok Sabhaలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత Supplementary Demands for Grants చర్చ సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ చర్చ అనంతరం వాయిస్ ఓటుతో అదనపు ఖర్చులకు సభ ఆమోదం తెలిపింది.
₹2.01 లక్షల కోట్ల అదనపు ఖర్చు
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో:
మొత్తం ₹2.81 లక్షల కోట్ల అదనపు ఖర్చుకి అనుమతి కోరింది అదనపు ఆదాయం ₹80,000 కోట్లుగా అంచనాచివరకు ₹2.01 లక్షల కోట్ల నికర ఖర్చుకు ఆమోదం లభించింది అలాగే Appropriation Bill 2026ను కూడా లోక్‌సభ ఆమోదించింది.ఆర్థిక లోటు లక్ష్యం మారదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిస్కల్ డెఫిసిట్ లక్ష్యం మారదని మంత్రి తెలిపారు. GDPలో 4.4% వద్దే ఫిస్కల్ డెఫిసిట్ కొనసాగుతుందని చెప్పారు.
రైతులకు ఎరువుల కొరత ఉండదు రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
- ₹19,230 కోట్లు – ఎరువుల సబ్సిడీ
- ₹23,641 కోట్లు – Pradhan Mantri Garib Kalyan Anna Yojana కోసం
- ₹41,822 కోట్లు – రక్షణ శాఖకు
అదనంగా రాష్ట్రాలకు ₹9,000 కోట్లు ఆరోగ్యం, ఎన్నికల వంటి అవసరాల కోసం కేటాయించినట్లు తెలిపారు.
Economic Stabilisation Fund ప్రపంచ పరిస్థితుల ప్రభావం
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
రోజూ కొత్త సమాచారం కోసం మా WhatsApp గ్రూప్ / ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
Read More: Read Today’s E-paper News in Telugu
