Doddi komaraiah|దొడ్డి కొమరయ్య జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Doddi komaraiah: IAS Officer M Hanumantha Rao అన్నారు దొడ్డి కొమరయ్య జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని. కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య (Doddi komaraiah) చిత్రపటానికి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య(Doddi komaraiah) జీవితం మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, వారు అతి పేద కుటుంబం నుండి రైతాంగ సాయుధ పోరాటానికి నైజాం ప్రభుత్వంలో ముందుండి పోరాడారని,వారి పోరాటాన్ని నేటి తరానికి తెలియజేసి వారి జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుంటే ఎంత అపజయాన్ని అయిన సాధించ వచ్చని, భవిష్యత్తులో బావి తరాల పౌరులుగా నిలుస్తారన్నారు.జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ.రైతాంగ పోరాటంలో నైజాం ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటంలో నిలిచారన్నారు. స్వాతంత్రం రావడానికి వారు ఎన్నో పోరాటాలు చేసి వారు బాధ్యత వహించారని అన్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి జిల్లా, గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, బిసి సంక్షేమ అధికారి యాదయ్య, ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్,స్టేట్ టిజేఏసీ ట్రెజరర్ మందడి ఉపేందర్ రెడ్డి ,కుల సంఘ నాయకులు,వివిధ శాఖల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp Group Join Now

Read More

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →