Telanganapatrika (July 04): జగిత్యాల జిల్లా సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనంతుల రవీందర్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది.

కోకో ఆటగాళ్లపై పరిశోధనకు డాక్టరేట్
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి “Physical Performance of Elite Koko Players in Telangana” అనే అంశంపై పరిశోధన చేసి, రవీందర్ గారు డాక్టరేట్ (Ph.D.) పొందారు. ఈ విశేషమైన సాధనకు ఆయనను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
వ్యాయామ ఉపాధ్యాయుని సంఘ నాయకుల ప్రశంసలు
ఈ సందర్భంగా పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు లుబోయిని పెల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి పాల్గొని అభినందనలు తెలిపారు. రవీందర్ సాధించిన విజయం విద్యా రంగానికి గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu