Telanganapatrika (June 29): కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదివారం గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజలతో నేరుగా ముఖాముఖి అయ్యారు.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ పేదల సంక్షేమమే ధ్యేయం
మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, “పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ వంటి పథకాలు వారికి ఆర్థికంగా ఊతమిచ్చేవిగా రూపుదిద్దుకుంటున్నాయి,” అని తెలిపారు. అలాగే, ఈ చెక్కులు వారి చేతికే అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు.
సమస్యలు నేరుగా చెప్పండి – మంత్రి హామీ
“నూతన మంత్రిగా నాకు నాలుగు శాఖల బాధ్యతలు ఉన్నాయి. కానీ ప్రజల సమస్యలపై ప్రతిస్పందనకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. వారంలో రెండు రోజులు నియోజకవర్గంలోనే గడుపుతాను. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా చెప్పండి,” అని ప్రజలకు భరోసా ఇచ్చారు.
నేతలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ పురాపాటి రాజిరెడ్డి, తదితర మండల నాయకులు, మాజీ సర్పంచులు, యువత నాయకులు, టౌన్ అధ్యక్షులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న ప్రజల ముఖాల్లో ఆనందం దర్శనమిచ్చింది.
Read More: Read Today’s E-paper News in Telugu