ఖమ్మం లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ కలకలం వీడియో కాల్ ద్వారా బెదిరించి ₹26 లక్షలు మాయం ఖమ్మం జిల్లాలో తాజాగా ఒక మహిళ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో తీవ్రంగా మోసపోయింది. Digital Arrest Scam Khammam గా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఘటనలో, ఆమె నుండి మొత్తం రూ. 26 లక్షల 50 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు.
ఒక వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ అయిన నేరగాడు, తనను ఐపీఎస్ అధికారి దయానంద్గా పరిచయం చేసుకున్నాడు. మహిళ అకౌంట్ నుండి అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పి, 17 మంది యువతులు ఫిర్యాదు చేశారని బెదిరించాడు.
అరెస్ట్ కాకుండా ఉండాలంటే రూ.20 లక్షలు పంపాలని డిమాండ్ చేశారు. భయంతో మహిళ మొదట డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. కానీ స్కామర్లు మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో, ఆమె తానున్న బంగారం తాకట్టు పెట్టి మిగతా మొత్తాన్ని పంపించింది.
అయితే తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Digital Arrest Scam Khammam డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏమిటి?
- ఇది ఒక నూతన రకమైన సైబర్ మోసం.
- నేరగాళ్లు పోలీసులు, CBI లేదా ED అధికారులుగా నటిస్తూ కాల్ చేస్తారు.
- వీడియో కాల్ ద్వారా అధికారిక లుక్‌తో బెదిరిస్తారు.
- బాధితులను కేసుల్లో ఇరుక్కుంటారని చెప్పి వెరవరించి డబ్బు తీసుకుంటారు.
- ఎక్కువగా మహిళలు, పెద్దవారు ఈ మోసులకు గురవుతున్నారు.
ముఖ్యమైన జాగ్రత్తలు
- ఎవరైనా వీడియో కాల్ ద్వారా చట్టపరమైన బెదిరింపులు చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి.
- ఏ ఒక్క వ్యక్తికీ మీ బ్యాంక్ వివరాలు, OTP, PAN, Aadhaar తెలియజేయవద్దు.
- డబ్బు పంపేముందు కనీసం ఒక స్నేహితుడు లేదా బంధువు సలహా తీసుకోండి.
- సైబర్ క్రైమ్ పోర్టల్
- (https://cybercrime.gov.in) లో వెంటనే ఫిర్యాదు చేయండి.
Also Read: Dog Attack Hyderabad: యజమానిని కాటేసిన పెంపుడు కుక్క కేసులో సంచలన ట్విస్ట్!
Comments are closed.