
డెంగ్యూ నివారణ ప్రబలకుండా ముందస్తు అవగాహన సదస్సు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో
TELANGANA PATRIKA (MAY20) , రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తుగా డెంగ్యూ నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన చర్యలపై మండల వైద్యాధికారి మాట్లాడుతూ..
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మాట్లాడుతూ రాబోయే వాన కాలంలో డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సన్నదం కావాలని అన్నారు ప్రతి గ్రామపంచాయతీ వార్డులలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి వాటి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు జ్వరాలు వచ్చాక ఇబ్బంది పడే కన్నా ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు ఇళ్లలో ఉన్న నీటి నిలవలను గుర్తించి మాఫింగ్ చేయాలని అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ప్రతి మంగళవారం మంగళ శుక్రవారం డ్రైడే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. అధికారులు తమ పరిధిలోని వార్డుల్లో ప్రజలకు ఆరోగ్యం పరిశుభ్రత దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలపై వార్డు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని వైద్య సేవ అందించాలని రక్త నమోనాల సేకరించి పరీక్ష నిమిత్తం పంపించాలని అన్నారు . డ్రై డే కార్యక్రమం కింద విలువ ఉన్న నీరు తొలగించాలని ఇంటిలో నీరు నిలువ ఉంచుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి ఎంపీడీవో రాజేందర్ ఎంపీ ఓ రాజేశ్వర్ గౌడ్ సిహెచ్ఓ రమేష్ వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీ లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Also Read : వేములవాడ-ముంబై మధ్య ఏసీ బస్సు సేవల ప్రారంభం: మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ హాజరు..
Comments are closed.