Chinese Manja Neck Injuries: నిషేధం ఉన్నప్పటికీ చైనీస్ మంజా (సింథటిక్ గాలిపటం దారం) వినియోగం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. గత ఏడు రోజుల్లో నలుగురు ద్విచక్ర వాహనదారులు ఈ ప్రమాదకరమైన దారం వల్ల మెడకు తీవ్ర గాయాలు పొందడం కలకలం రేపుతోంది.

తాజా ఘటనలో డిసెంబర్ 30న, సైదాబాద్‌లోని ఓ థియేటర్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న టి. అశోక్ (29) మెడకు గాజు పూత ఉన్న మంజా చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై రక్తస్రావంతో కుప్పకూలిన అతడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎం. క్రాంతి వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
అంతకుముందు డిసెంబర్ 29న, షంషీర్‌గంజ్ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ జమీల్ మెడకు మంజా బిగుసుకోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడు. అతడికి ఆసుపత్రిలో 22 కుట్లు వేయాల్సి వచ్చింది.
డిసెంబర్ 26న, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి జశ్వంత్ రెడ్డి కూడా ఇలాంటి ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదే తరహాలో డిసెంబర్ 25న, లాంగర్ హౌజ్ ట్రాఫిక్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శివరాజ్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న సమయంలో మెడకు మంజా చిక్కి గాయపడ్డాడు.
చైనీస్ మంజా మనుషులకే కాదు, పక్షులకు కూడా ప్రాణాంతకం కావడంతో ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అయినా కొందరు గాలిపటాల ప్రేమికులు నిర్లక్ష్యంగా వాడుతుండటంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Chinese Manja Neck Injuries పోలీసుల హెచ్చరిక:
ఫ్లైఓవర్లు, ఓపెన్ రోడ్లపై ప్రయాణించే బైక్ రైడర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మెడ రక్షణకు స్కార్ఫ్ లేదా జాకెట్ కాలర్ ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రజల నిర్లక్ష్యం వల్ల చిన్న వినోదం ప్రాణాంతకంగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu
