Telanganapatrika (జూలై 22 ): Currency Note Printing Cost 2025, నోట్ల గురించి మనలో చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వాటిపై ఉన్న చిత్రాలు, రంగులు, పరిమాణం గురించి తెలుసుకోవడమే కాదు… ఆ నోట్లను తయారుచేయడానికి ఎంత ఖర్చవుతుందన్న విషయం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

Currency Note Printing Cost 2025.
భారతదేశంలో కాగితపు ద్రవ్య వినిమయం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1935లో ఏర్పడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 1938లో మొదటిసారిగా కరెన్సీ నోట్లను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹10 నుంచి ₹2000 వరకు వివిధ నోట్లు ముద్రించబడినాయి. అయితే వాటిని ముద్రించడానికి వచ్చే ఖర్చు ఎంత అనే అంశం మీకు తెలుసా?
నోట్ల ముద్రణకు ఖర్చు ఇలా ఉంటుంది:
- ₹500 నోటు – ₹2.94
- ₹200 నోటు – ₹2.93
- ₹100 నోటు – ₹1.77
- ₹50 నోటు – ₹1.13
- ₹20 నోటు – ₹0.95
- ₹10 నోటు – ₹0.96
- ₹2000 నోటు – ₹3.54 (ఇప్పుడు రద్దు చేయబడింది)

నోట్లపై ఉండే చారిత్రక చిత్రాలు:
- ₹500 నోటుపై – ఢిల్లీలోని ఎర్రకోట (17వ శతాబ్దం)
- ₹200 నోటుపై – మధ్యప్రదేశ్‌లోని సాంచి బౌద్ధ స్థూపం (2వ శతాబ్దం)
- ₹100 నోటుపై – గుజరాత్‌లోని రాణీకి వావ్ (11వ శతాబ్దం)
- ₹50 నోటుపై – కర్ణాటక హంపి రథం (15వ శతాబ్దం)
- ₹20 నోటుపై – ఎల్లోరా గుహలు (ఔరంగాబాద్)
- ₹10 నోటుపై – ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయ రథ చక్రం (13వ శతాబ్దం)
ఈ వివరాల ద్వారా మనం నోట్ల వెనుక ఉన్న చరిత్రను మాత్రమే కాదు, వాటి తయారీకి వచ్చే ఖర్చును కూడా అర్థం చేసుకోవచ్చు. RBI ఈ వివరాలను ఆర్థిక నివేదికలలో పేర్కొంటూ, దేశ ప్రజలకు డిజిటల్ దిశగా ప్రోత్సాహం అందిస్తూ ఉంది.
Read More: Phone Tapping : మీ ఫోన్ ట్యాప్ అయిందా..? లేదా తెలుసుకునే సింపుల్ టెస్ట్..!