
-నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లక్ష్యం
-సరియైన డాక్యుమెంట్ లేని 118 వాహనాలు,220 లీటర్ల మద్యం సీజ్
-అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్ కు అందించాలి
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
తెలంగాణ పత్రిక, మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలో గల ప్రకాశ్ నగర్ కాలనిలో తెల్లవారు జామున జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాలతో డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు 20 యస్. ఐలు మొత్తం కలిపి 280 మంది పోలీస్ సిబ్బంది, ఒక నార్కోటిక్ డాగ్ తో సోదాలు చేయగా, సరియైన పత్రాలు లేని 98 టు విల్లర్ వాహనాలు, 16 ఆటోలు,3 కార్లు,1 ఇసుక ట్రాక్టర్, 220 లీటర్ల మధ్యం సీజ్ చేసి ముగ్గురు రౌడీ షీటర్స్, ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక కార్యకలాపాల కట్టడి కొరకు పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించి..కాలనీల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు రక్షణ కల్పించుటకు జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తుందని, కాలనిలో ఏలాంటి సమస్యలు ఉన్న తెలియజేయాలని అన్నారు.ముఖ్యంగా నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతో ముఖ్యం అని వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జిల్లాలో గంజాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తున్నామని తెలిపారు. గంజాయి సేవించిన కొంత మంది అనుమానితులకి టెస్టులు నిర్వహించడం జరిగిందని వీరిలో ఒక్కరికి కూడా పాజిటివ్ రాకపోవడం సంతోషకరమైన విషయం అని అన్నారు.ఎక్కడైన గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐలు సోమ నర్సయ్య, పి.యం.డి ప్రసాద్, మోతిరం, జనార్ధన్ గౌడ్ శ్రీను నాయక్, కరుణాకర్ ఎస్ఐలు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మిర్యాలగూడలో కార్డెన్ అండ్ సెర్చ్ – నేరరహిత పట్టణమే లక్ష్యం 2025.

Read More: Read Today’s E-paper News in Telugu