తెలంగాణ పత్రిక, వెబ్డెస్క్: Coolie మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. Super Star Rajinikanth నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ Lokesh Kanagaraj దర్శకత్వంలో తెరకెక్కింది.
సినిమా ( Coolie Movie ) విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తోంది. మొదటి రోజు నుండే సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది.

గత 24 గంటల్లో మాత్రమే 5,72,870 టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడయ్యాయి. ఇది ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
అన్ని భాషల్లో హౌస్ ఫుల్ షోలు ప్రకటించారు. థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.
రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
లోకేశ్ కనగరాజ్ మాస్ స్టైల్ సినిమాకు ప్లస్ పాయింట్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
“ఇది మాసివ్ కాదు.. సునామీ!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులు ఈ సినిమాకు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ కట్టేశారు.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 151 కోట్లు వసూలు చేసింది కూలీ. ఇది కోలీవుడ్ చరిత్రలో అత్యధిక మొదటి రోజు కలెక్షన్.
ఇది లియో సినిమా రికార్డును బ్రేక్ చేసింది. లియో మొదటి రోజు 148 కోట్లు రాబట్టింది. రెండు సినిమాలకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించడం విశేషం.
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో కూలీ ఏ రేంజ్ లో రాంపేజ్ చేస్తుందో చూడాలి.