Telanganapatrika (July 14): కార్యకర్తలకే ఇళ్లు , ఇందిరమ్మ కమిటీల పేరు మీద కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలకే ఇళ్లు మంజూరి చేయడం అన్యాయమని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండారపు కృష్ణారెడ్డి, ఎండి సత్తార్, సురేష్ నాయక్ తో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు బీఆర్ఎస్ నేత తోట ఆగయ్య మండిపాటు..
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిష్పక్షపాత విధానాలతో అర్హులైన వారిని గుర్తించి డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వడం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు కళ్ళుండి చూడడం లేదని, మెదడుండి ఆలోచించడం లేదని విమర్శిస్తూ మండేపల్లి, శాంతినగర్, రగుడు, పెద్దూర్ లో భారీ ఎత్తున డబుల్ బెడ్ రూమ్, ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు.
అలాగే అన్ని మండల కేంద్రాలలో, పలు గ్రామాలలో కూడా డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇచ్చామన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేదవాడి కలగా పేర్కొంటూ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగిందని ఇప్పుడు ఆ ఇసుక దొరకడం గగనమైపోతోందని విమర్శించారు. మూడు వేలకు తక్కువ కాకుండా ఇసుకకు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇంటికి ఇచ్చే ఐదు లక్షలు, ఇసుకకే ఒక లక్ష రూపాయలు విచ్చించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అన్ని రకాల నిర్మాణాలకు ఇసుకను అందుబాటులో ఉంచేలా చూడాలని, ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలని ఆ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu