Telanganapatrika (July 29): ఎల్లారెడ్డిపేటలో కలెక్టర్ సందీప్ ఆకస్మిక తనిఖీ , జిల్లాలోని ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ షాపుల నిర్వాహకులు తమ ఈ పాస్ యంత్రాలలోని నిల్వ దుకాణాల్లో ఎరువులు, ఇతర సరుకు నిల్వ సరిగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ఎల్లారెడ్డిపేటలో కలెక్టర్ సందీప్ ఆకస్మిక తనిఖీ నిల్వల అక్రమాలకు చెక్..
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ గోదాం, గొల్లపల్లిలో శ్రీ సాయినాథ్, బొప్పాపూర్ రోడ్ లోని శ్రీ మహేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ దుకాణాల్లో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి దుకాణాల్లోని రికార్డులను సరుకు నిలువను లైసెన్సులను వారు అమ్మే పురుగు మందులను పరిశీలించారు.ఇకముందు స్టాక్ లో తేడా ఉండవద్దని, ఆయా ఎరువుల దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లను, లైసెన్సులను పరిశీలించారు.
ఈపాస్ యంత్రంలోని స్టాకు.. గోదాంలో ఉన్నటువంటి స్టాకు యూరియా బస్తాలను స్వయంగా లెక్కించి, సరి చూసారు. స్టాకు లో స్వల్ప తేడాను గమనించి ఇకముందు ఈ విధంగా స్టాక్ లో తేడా లేకుండా సరియైన విధంగా నిర్వహించాలని షాపు యజమానులను ఆదేశించారు.పురుగు మందులను శాంపుల్ టెస్ట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో రైతులకు ఎరువులు, ఇతర సామాగ్రి విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ఎరువుల, విత్తనాలు విక్రయాలు నిబంధనల ప్రకారం నాణ్యమైనవి విక్రయించాలని చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫజల్ బేగం జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu