Telanganapatrika (July 28): కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి రైతులు తీసుకున్న కోడల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ లో ఉన్న వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని 85 జతల కోడెలను 170 జీవాలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు..
గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు.కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు.వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
వన మహోత్సవంలో భాగంగా గోశాల ఆవరణలోని రోడ్డు వెంట కొబ్బరి మొక్కలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి నాటారు.అనంతరం గోశాలలో పరిశీలించి.అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈఓ రాధాభాయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, మరియు దేశి గో వంశ రక్షణ సంవర్ధన సమితి టోలి సభ్యులు రాధాకృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తదితరులు ఉన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “85 జతల రాజన్న కోడెల పంపిణీ : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..”